సారథి న్యూస్, అయిజ(మానవపాడు): నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్ఓబీసీ సెల్రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి తెలిపారు. సోమవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ఉద్యోగులంతా తిండి తిప్పలు మాని ఇబ్బందులు పడుతుంటే, కూటికి గడవక కూలికిపోతుంటే చోద్యంచూసిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల రాగానే చికెన్, మటన్ బిర్యానీలు తినిపిస్తున్నారని విమర్శించారు. ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా కొనసాగిన రాంచందర్ రావు ఏనాడూ నిరుద్యోగుల కోసం మాట్లాడిన పాపానపోలేదన్నారు. పట్టభద్రులుగా ఎమ్మెల్సీగా జి.చిన్నారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తుపత్రాల పాండు, బసవరాజు, మద్దిలేటి, హనుమన్న, దేవేందర్, మధు పాల్గొన్నారు.
- March 8, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- CHINNAREDDY
- CONGRESS
- MLC ELECTIONS
- OBC CELL
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఓబీసీ సెల్
- కాంగ్రెస్
- చిన్నారెడ్డి
- నిరుద్యోగ భృతి
- Comments Off on నిరుద్యోగ భృతి కోసం నిరాహార దీక్ష