Breaking News

ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. రూ.2 నుంచి రూ.20లక్షల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీచేశారు.
ఇవి ప్రోత్సాహకాలు
– 2వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
– 2 నుంచి 5వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనుంది.
– 5వేల నుంచి 10వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.15 లక్షల ప్రోత్సాహకం ప్రకటించింది.
– 15వేల జనాభా దాటిన పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనుంది.