Breaking News

ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న అధిక ధరలురచన: సి.హెచ్.ప్రతాప్

సామాజిక సారథి , హైద రా బాద్ : ప్రభుత్వం ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణ రేటు పెరుగుదలను, తగ్గడాన్ని అంచనా వేస్తూనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు తగ్గుదల ద్రవ్యోల్బణం రేటులో కనిపించినప్పటికీ అది సామాన్యుడి బ్రతుకులకు సూచిక కాదన్నది సామాజిక నిపుణుల భిప్రాయం. గత రెండు నెలల నుంచి టోకు ధరల సూచీ తగ్గు ముఖం పట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఘనంగా ప్రకటించుకుంది. దెస ప్రజలకు అచ్చే దివస్ వచ్చాయని ప్రధానమంత్రి సైతం ఇతీవలి మన్ కి బాత్ లో గొప్పగా ప్రకటించుకున్నారు. ఇందుకు మద్దత్తుగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ లో టోకు ధరల సూచీ 8.39 శాతం ఉంటే నవంబర్‌ నాటికి అది 5.85 శాతానికి తగ్గింది. గత 21 నెలలుగా ఇంతగా తగ్గడం ఇదే మొదటి సారి. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరొక విధంగా వున్నాయి. టోకు ధరల సూచీ తగ్గు ముఖం పట్టినందువలన పేద, సామాన్యుల జీవితాలలో ఆశించినంత మార్పేమీ రాలేదు. గుప్పెడు మెతుకులకై వారి ఆరాటం, చేసే పోరాటం అలాగే వున్నాయి. పైగా వీరి బ్రతుకులలో పెను మార్పులు సంభవించే కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకుంది. దాదాపు 80 కోట్ల మందికి అయిదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఇప్పటిదాకా అందుతూ రాగా ఈ నెల తరవాత ఆ సదుపాయం ఉండదు.వారు మార్కెట్ ధరలకే ఆహార ధాన్యాలు ఇకపై కొనుక్కోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వం దగ్గర ఆహార ధాన్యాల నిలవలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో నిలవలు తగ్గితే మార్కెట్లో ధరలకు రెక్కలు రావడం ఖాయం. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఆహార ధాన్యాల నిలవలు గత ఆరు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువగా స్థాయికి పడిపోయాయి.అందు వలన రలు అదుపు చేయడం కోసం మార్కెట్‌ లోకి ఆహార ధాన్యాలు భారీగా విడుదల చేసే స్థితిలో ప్రభుత్వం లేదు.గోధుమ ఎగుమతులను నిషేధించిన తరవాతే స్థానిక మార్కెట్‌లో గోధుమ ధరలు కనీసం 28 శాతం పెరిగాయి. సామాన్య మానవుడు వినియోగించే అనేక సరుకుల ధరలు అంతకంతకూ భారమై పోతున్నాయి.రష్యా-ఉక్రేన్‌ మధ్య యుద్ధంవల్ల ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి కనక మన దేశంలోనూ ధరలు పెరగడం అసహజం ఏమీ కాదని సరిపెట్టుకున్నా సామాన్యుడికి మాత్రం అది మోయ లేని భారమే.మరొక పక్క చిన్న ఉద్యోగుస్థులకు కరోనా సాకుతో జీత భత్యాలు గత రెండేళ్ళుగా పెరగడం లేదు. జీతాలు పెరగకపోగా, ధరలు అంతకంతకూ పెరుగుతుండడం వలన ఈ దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు నరకప్రాయం అవుతున్నాయి. కంటికి కనిపించని కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్న జనజీవనానికి పెరుగుతున్న ధరలు మళ్లీ ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుండడంతో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావం నిత్యావసర ధరలపై పడుతున్నది. ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం పేరుతో వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా ధరలను పెంచుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతుండగా.. పెరిగిన వంట నూనె ధరలు సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. డీజిల్‌ ధర అమాంతం హద్దులు దాటడంతో సరుకు రవాణా ఖర్చులు పెరిగి పరోక్షంగా అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నది. అన్నదాతలకు సైతం వ్యవసాయ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రం ఇష్టారాజ్యంగా పెంచుతుండడంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోజువారీగా పైసా చొప్పున సున్నితంగా పెంచుతున్న ఇంధన ధరలతో ఆల్‌ టైం గరిష్టానికి పెట్రోల్‌, డీజిల్‌ చేరుకున్నది. వందల రూపాయల వడ్డనతో వంట గ్యాస్‌ ధర రూ.వేయి దాటి రూ.11వందలకు చేరింది. ఇంధన మంటతో రవాణాపై పెను ప్రభావం చూపడంతో నిత్యావసరాలు, అత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు రూ.వంద జేబులో పెట్టుకుని మార్కెట్‌కు వెళ్తే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చే ….