సారథి, చొప్పదండి: కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా మల్లన్నపల్లె గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గొల్లె మౌనిక, సురేష్ దంపతుల కూతురు శ్రీవాణి వివాహానికి శనివారం ఆ పార్టీ నాయకులు రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేసారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గొల్లె సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్ కుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు జాడి రాజు, గన్ను సంతోష్ రెడ్డి, చుప్ప శ్రీనివాస్, బండారి రాజేష్, బండారి వినోద్, భక్తు శ్రీనివాస్, జాడి బాపయ్య, రాజవీరు పాల్గొన్నారు.
ఐసొలేషన్ సెంటర్ లో అన్నదానం
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో ఏర్పాటుచేసిన కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ లో కరోనా పేషెంట్లకు శనివారం ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం, రాత్రిపూట భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిత్యం ప్రజాసమస్యలపైన పోరాటం చేస్తూ కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేవారని కొనియాడారు. నిత్యం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న మేడిపల్లి సత్యం భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలాషించారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొత్తూరి మహేష్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గొల్లె సంపత్, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, గన్ను సంతోష్ రెడ్డి, చుప్ప శ్రీనివాస్, జాడి రాజు, బండారి రాజేష్, బండారి వినోద్, చిరంజీవి పాల్గొన్నారు.