– అడిషనల్ ఎస్పీ సందెపొగు మహేందర్
సారథి సిద్దిపేట, ప్రతినిధి: ప్రజలు ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలని అడిషినల్ ఎస్పీ సందెపొగు మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో, ఏఎస్పీ డివిజన్ పరిధిలోని లాక్ డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి బయట తీరగొద్దన్నారు. డివిజన్ ప్రజలంతా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే తమ తమ కార్యకలాపాలు ముగించుకోవాలన్నారు. అనవసరంగా రోడ్లపైకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
734103 క్వింటాళ్ల ధాన్యం కొన్నం
– ఆర్డీవో జయచంద్రారెడ్డి
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఆరు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోల ప్రక్రియ ముగియడానికొస్తుందని ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు హుస్నాబాద్ 2639 మంది రైతులు, 128369 క్వింటాళ్లు, కొహెడ 2996 మంది రైతులు, 191962 క్వింటాళ్లు, మద్దూర్ 1634 మంది రైతులు, 82514.8 క్వింటాళ్లు, దూళిమిట్టా1051 మంది రైతులు, 53626.4 క్వింటాళ్లు, అక్కన్నపేట 3033 రైతులు, 154068 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు 9609 మంది రైతులకు గాను 13321 మంది రైతుల బ్యాంక్ అకౌంట్ లో రూ.102 కోట్లు నగదు జమ చేసినట్లు ఆర్డీవో తెలిపారు.