Breaking News

సాయం చేసినందుకు …కోరిక తీర్చాలంటున్నడు

    • భర్త లేని ఒంటరిమహిళ పై యువకుడు అఘాయిత్యం
    • బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

    సామాజికసారథి, నాగర్ కర్నూల్: కట్టుకున్న భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఉన్న ఇద్దరు సంతానాన్ని పోషించుకునేందుకు తన భర్త తరపు పొలం ఆసరా అవుతుందనుకున్నది ఆ భార్య. కాని తన దాయాదులు న్యాయంగా తనకు రావాల్సిన తన భర్త పొలాన్ని ఇవ్వకుండా ముప్ప తిప్పలు పెట్టడంతో సాయం కోసం గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి ని సాయం చేయాలని కోరింది ఆ మహిళ. దీంతో ఆ గ్రామ యువకుడు భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు ఆ మహిళను ఇబ్బంది పెడుతున్న ఆమె దాయాదులతో మాట్లాడి నచ్చజెప్పాడు. భర్తను కోల్పోయిన ఆ మహిళకు న్యాయంగా చెందాల్సిన భూమిని ఇవ్వాలని మాట సాయం చేశాడు. అంతటితో ఆగకుండా భర్త లేని ఆ మహిళపై కన్నేసిన ఆ గ్రామ యువకుడు నీ భూమి సమస్యను పరిష్కరించాను కదా… నా కోరిక తీర్చాలని బరితెగింపుకు దిగాడు. గ్రామ సమీపంలో ఒంటరిగా రోడ్డుపై ఉన్న ఆ ఒంటరి మహిళ చేతిని పట్టుకొని అఘాయిత్యానికి తెగబడ్డాడు. దీంతో నివ్వెర పోయిన సదరు ఒంటరి మహిళ ఆ కిరాతకుడి చేతి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ పెద్ద మనిషి పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన కూన లక్ష్మమ్మ తొమ్మిదేళ్ల క్రితం భర్త శేఖర్ అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మృతితో తనకు ఉన్న ఇద్దరు సంతానాన్ని పోషించేందుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వెలు గొండ గ్రామంలోనే తన భర్త శేఖర్ కు చెందిన వ్యవసాయ భూమి తనకు ఉపయోగపడుతుందని ఆశించినా ఆమె దాయాదులు భూమిని ఇవ్వకుండా సతాయించడం ప్రారంభించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తనకు న్యాయం చేయాలని వెలుగొండ గ్రామానికి చెందిన యువకుడేనా నాగనోలు మదుసుదన్ రెడ్డి వద్దకు వెళ్లి తనగోడును వెల్లబోసుకుంది. భర్త లేకపోవడం పొలం సమస్య ఉండడంతో యువకుడు ఒంటరి మహిళ లక్ష్మమ్మ పై కన్నువేశాడు. వెంటనే పోలం సమస్యపై ఆ మహిళ దాయాదులతో మాట్లాడి ఇతర పెద్దల సమక్షంలో పొలం సమస్య పరిష్కరించేందుకు మాట్లాడుతానా అంటూ . కాని అంతటితో ఆగకుండా ఆ యువకుడు బుధవారం వెలు గొండ గేట్ వద్ద ఒంటరిగా ఉన్న కూన లక్ష్మమ్మ ను చూసి నీ భూమి సమస్యను పరిష్కరించాను కదా… నా కోరిక కూడా తీర్చాలంటూ వెంటపడ్డాడు. అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఏకంగా ఆ మహిళ ను చేతిని పట్టుకొని బస్టాండ్ వెనకవైపు కు లాక్కేళ్లడంతో విస్తుపోయిన ఆమె అతని నుంచి తప్పించుకొని గ్రామంలోకి పరిగెత్తింది. వెంటనే తనపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన మదుసుదన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయం చేసి పెద్దమనిషి పేరుతో భర్త లేని తనపై కోరిక తీర్చాలని వెంటపడిన మదుసుధన్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని బాధితురాలు పోలీసులను కోరింది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *