Breaking News

గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

సామాజిక సారథి, పటాన్‌చెరు: పాశ్చాత్య దేశాలలో ఆల్ సెయింట్స్ డే సందర్భంగా ప్రతియేటా అక్టోబర్ 31న హలోవీన్ జరుపుకుంటారు. భయానక ఉత్సవంగా విశ్వవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హాస్టల్ విద్యార్థులు మంగళవారం క్రీడా మైదానంలో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు విభిన్న వేషధారణలతో అలరించారు. ముఖానికి రంగులు, సరదా ఆటలతో పాటు సంగీతం, బ్యాండ్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు. స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ వేడుకలు తేనీటి విందుతో ముగిశాయి.