Breaking News

‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

సారథి, పెద్దశంకరంపేట: హనుమాన్ జయంతి సందర్భంగా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని తిరుమలాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, పెద్దశంకరంపేట రామాలయం లో భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. కరోనా వేళ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ పూజారి రంగాచారి ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జనగం శ్రీనివాస్, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, పలువురు భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.