- రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సామాజికసారథి, నాగర్ కర్నూల్: క్రీడాకారుల శరీరక దృఢత్వానికి జింమ్ లు అవసరమని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డిలతో కలిపి ఓ ప్రైవేట్ జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి శారీరకంగా ధృడంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని, ఇలాంటి జిమ్ లు అందుకు దోహదపడతాయని అన్నారు. వి గోల్డ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ లోని ప్రతి జిల్లా కేంద్రంలో పట్టణ కేంద్రాలలో నెలకొల్పాలని అభిలషించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు ప్రాధాన్యం కల్పించాలన్న సంకల్పంతో ఇప్పటివరకూ 45 స్టేడియాలను నిర్మిచినట్లు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జమాల్ భాషా ఆయన తనయుడు వి గోల్డ్ జిమ్స్ గ్రూపుల యజమాని సయ్యద్ అవేజ్ లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జిమ్ లోని ప్రతి విభాగాన్ని మంత్రితో కలిసి పరిశీలించారు. అధునాతన పరికరాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ మనోహర్, డీఎస్పీ మోహన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్ బాబురావు, జడ్పీటీసీ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.