Breaking News

గుట్టలెక్కి.. వాగులు దాటి

గుట్టలెక్కి.. వాగులు దాటి


  • గిరిజన గూడెల్లో పల్స్​పోలియో
  • చుక్కల మందు వేసిన వైద్యసిబ్బంది

సారథి న్యూస్, వాజేడు: మారుమూల అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని పెనుగోలు గుట్టపైకి దాదాపు 36 కి.మీ మేర కాలినడకన నడిచి వెళ్లారు వైద్యసిబ్బంది.. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేశారు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి మందులు ఇచ్చారు. అలాగే జ్వరం ఉన్న ఐదుగురి నుంచి రక్తనమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, స్టాఫ్ నర్స్ పద్మ, చిన్న వెంకటేష్, ఏఎన్ఎం రాజేశ్వరి, ఆశా కార్యకర్త సమ్మక్క, ములుగు జిల్లా సీసీఎం నదీమ్ ఖాన్, ఏటూర్ నాగారం తహసీల్దార్​ సయ్యద్ సర్వర్, కొంగల వీఆర్వో నరసింహారావు, వీఆర్ఏ బాలకృష్ణ పాల్గొన్నారు.

చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న వైద్యసిబ్బంది