Breaking News

గుట్కా ఫ్యాకెట్ల ముఠా అరెస్ట్

గుట్కా ఫ్యాకెట్ల ముఠా అరెస్ట్
  • జహీరాబాద్ లో రూ. 2 లక్షలు,
  • ఆలుబాకలో 1.28 లక్షల గుట్కా ఫ్యాకెట్లు స్వాధీనం

సామాజిక సారథి, వెంకటాపురం/ జహీరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాకలో ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో రూ.1.28 లక్షల విలువ గల గుట్కా ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ తిరుపతి తన సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా చర్ల వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న టాటా మ్యాజిక్, ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీ చేయడంతో అందులో ప్రభుత్వం నిషేధిత గుట్కా ఫ్యాకెట్లు బయటపడ్డాయి. ఈ నిషేధిత గుట్కా ఫ్యాకెట్లను చత్తీస్​ఘడ్ రాష్ట్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చిఅధిక ధరలకు విక్రయిస్తున్న చర్ల మండలానికి చెందిన ముఠా సభ్యులను నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. అలాగే జహీరాబాద్ సమీపంలోని పాత ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రెండు లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్లు జహీరాబాద్ రెండో ఎస్ఐ నర్సింహులు తెలిపారు. బీదర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని తనిఖీ చేయగా ఆ లారీలో 42 పెద్ద సైజ్ గుట్కా బ్యాగులు వున్నాయని, వాటి విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందన్నారు. లారీ డ్రైవర్ షేక్ హజార్ తన యజమాని మొహమ్మద్ ఉస్మాన్ ఆదేశం మేరకు గుట్కాను హైదరాబాద్ కు తరిలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.