సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మండలంలోని అభివృద్ధి పనులపై డీఆర్డీవో శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి హామీ, ఐకేపీ ఆఫీసులను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సముదాయ కార్యాలయం ముందున్న మొక్కలకు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మితో కలిసి నీళ్లు పట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం హరితహారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ఫ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీడీవో గణేష్ రెడ్డి తో కలిసి గవ్వలపల్లి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీవో గిరిధర్ రెడ్డి, ఏపీఎం వెంకటస్వామి, నాయకులు యాదవరావు పాల్గొన్నారు.
- January 29, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CHINNASHANKARAMPET
- EGS WORKS
- GREEN FRIDAY
- medak
- గ్రీన్ఫ్రై డే
- చిన్నశంకరంపేట
- మెదక్
- Comments Off on ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’