సారథి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం చాటుకున్నారు. ఇటీవల మరణించిన కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కైసర్ పాషా కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే గరా రాములు కుటుంబానికి రూ.రెండువేల చొప్పున సాయం చేశారు. అలాగే కరోనాతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ ఖాన్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మండలాధ్యక్షుడు చిటమట రఘు, ఎండీ అప్సర్ పాషా, మైల జయరాంరెడ్డి, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, మాజీ ఎంపీపీ కోనేరు నగేష్, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్నఎల్లయ్య, పెద్దబోయిన నర్సింహరావు, వావిలాల నర్సింగరావు, రాధిక, లాలయ్య పాల్గొన్నారు.
- June 13, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- CARONA
- MLA SITHAKKA
- MULUGU
- ఎమ్మెల్యే సీతక్క
- కరోనా
- ములుగు
- Comments Off on ఎమ్మెల్యే సీతక్క గొప్ప సాయం