సారథి, హైదరాబాద్: అర్హులందరికీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ద్వారా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సోమవారం ఉప్పల్ డిప్యూటీ తహసీల్దార్ రఫీఉద్దీన్, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సరస్వతికి కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కోశాధికారి చింతల సురేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ కార్యదర్శి పద్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధికార ప్రతినిధి కంది కంటి కన్నాగౌడ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ సహ కార్యదర్శి వగ్గుల సుందర్ నారాయణ, నాగోల్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, సీనియర్ నాయకులు డప్పు రాజు, కొత్తపేట డివిజన్ ఓబీసీ అధ్యక్షుడు కొత్త తిరుమల, కొత్తపేట డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మంచి రాజేష్, కొత్తపేట్ డివిజన్ బీజేపీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.
- June 14, 2021
- Archive
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- BJP
- garib kalyanyojana
- ration cards
- గరీబ్ కల్యాణ్ అన్న యోజన
- బీజేపీ
- రేషన్ కార్డులు
- హైదరాబాద్
- Comments Off on రేషన్ కార్డులు మంజూరు చేయండి