సామాజిక సారథి, ఆమనగల్లు: అంగరంగవైభవంగా సదర్ సమ్మేళనం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదర్ సమ్మేళనం ఉత్సవాలు మొట్టమొదటి సారిగా ఆమనగల్లు పట్టణంలో ఇంత బ్రహ్మడంగా, కనుల పండుగా నిర్వహించిన యాదవ సోదరులను అభినందించారు. నరకాసురుని వధించిన దానికి ప్రతీకగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తారని అన్నారు. ఇదే విధంగా ఆమనగల్లు కూడా అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని, 15రోజుల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో సదర్ సమ్మేళనం ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో మాడుగుల రోడ్ జన సందోహంగా మారింది. ఈ కార్యక్రమంలో శ్రీయాదవ సంఘం అధ్యక్షుడు, ఎఎంసీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, జడ్పీటీసీ అనురాధ, సీఎల్ శ్రీనివాస్ యాదవ్, రాములు యాదవ్, మల్లేష్ యాదవ్, నిట్ట నారాయణ, అప్పం శ్రీను, పాపిశెట్టి రాము, అంజయ్య యాదవ్, పాల్గొన్నారు.
- October 31, 2022
- Archive
- లోకల్ న్యూస్
- Jaipal Yadav
- MLA
- Sadar
- Sammelana
- Sincerely
- Utsavas
- Comments Off on ఘనంగా సదర్ సమ్మేళన ఉత్సవాలు