Breaking News

ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు

ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు

సారథి, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి, మల్లుపల్లి, రుద్రారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ జిల్లా డీఆర్డీవో శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం డీఆర్డీఏ ఐకేపీ ద్వారా 110 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నేటికీ 14,600 మంది రైతుల నుంచి రూ.123 కోట్ల విలువైన 6.64 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 12,600 మంది రైతుల ఖాతాల్లో రూ.78 కోట్లు డబ్బులు జమ అయినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన ఆరు కేంద్రాలను మూసివేశామన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య, డీపీఎం మోహన్, మండల ఏపీఎం వెంకటస్వామి, సీసీలు యశోద, రాజు వీవోఏ లావణ్య, శేఖర్ మండల సమాఖ్య కార్యదర్శి కల్పన, మూడు గ్రామాల కొనుగోలు కమిటీ సభ్యలు పాల్గొన్నారు.