సారథి న్యూస్, తాడ్వాయి: పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కోరారు. శుక్రవారం మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో ములుగు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువతకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడారంలోని ఇంగ్లిష్ మీడియం పాఠశాలను తనిఖీ చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమార స్వామి, తాడ్వాయి మండలాధ్యక్షుడు అనంతరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముద్రకోల తిరుపతి, సీతక్క యువసేన మండలాధ్యక్షుడు చెర్ప రవీందర్, యూత్ అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, కన్నాయిగూడెం జడ్పీటీసీ కరంచంద్ గాంధీ పాల్గొన్నారు.
- March 5, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- CONGRESSS
- GRADUATES
- MLA SITHAKKA
- MLC ELECTIONS
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- కాంగ్రెస్
- పట్టభద్రులు
- ములుగు సీతక్క
- Comments Off on పట్టభద్రులూ.. ఆలోచించి ఓటు వేయండి