సారథి, పెద్దశంకరంపేట: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని నారాయణఖేడ్ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆయన మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 161 రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు ఆకలి బాధ ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో నూతనంగా రేషన్ కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు విజయరామరాజు, వైస్‌ఎంపీపీ లక్ష్మీరమేష్, రైతుబంధు అధ్యక్షుడు సురేష్‌గౌడ్, పెద్దశంకరంపేట సర్పంచ్అలుగుల సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంబ్ల రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు వేణుగోపాల్‌గౌడ్, మాణిక్‌రెడ్డి, తహసీల్దార్ చరణ్‌సింగ్, ఆర్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
- July 28, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- NARAYANAKHED
- peddashankaram
- ration card
- ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
- నారాయణఖేడ్
- పెద్దశంకరంపేట
- Comments Off on పేదలందరికీ ప్రభుత్వ పథకాలు