సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వత్రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ములుగు ఎస్టీయూ భవన్లో అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ అధ్యక్షతన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, మోడల్ స్కూలు టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ముందుండి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్టీయూ మద్దతు ప్రకటించించిన జయసారథిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానకార్యదర్శి సోలం కృష్ణయ్య నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఇనుగాల సూర్యనారాయణ, ములుగు మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, కంది రఘుపతి, వెంకటాపూర్ అధ్యక్షుడు బండారి జగదీశ్, కన్నాయిగూడెం అధ్యక్షురాలు సుమలత, గోవిందరావుపేట్ అధ్యక్షుడు పోరిక రాజన్న, మంగపేట్ ప్రధానకార్యదర్శి జుమ్మిలాల్, తాడ్వాయి బాధ్యులు సతీష్, మహిళాకార్యదర్శులు లలిత, రాజేశ్వరి, సతీష్ పాల్గొన్నారు.
- March 7, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- MLC ELECTIONS
- MULUGU
- STU
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఎస్టీయూ
- ములుగు
- Comments Off on ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం