సారథి, పెద్దశంకరంపేట: బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండలంలోని ఉత్తులూర్ గ్రామానికి చెందిన సంగమ్మ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఎల్ వోసీ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్ లు అలుగుల సత్యనారాయణ, కుంట్ల రాములు, పార్వతి శంకర్ గౌడ్, ఎంపీటీసీలు, వీణా సుభాష్ గౌడ్, దామోదర్ పున్నయ్య, సాయిలు పాల్గొన్నారు.
- May 30, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- medak
- MLA BHUPALREDDY
- PEDDASHANKARAMPET
- ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
- పెద్దశంకరంపేట
- మెదక్
- సీఎంఆర్ఎఫ్
- Comments Off on పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి