Breaking News

ప్రైవేట్ టీచర్లకు వరాలు

ప్రైవేట్ టీచర్లకు వరాలు

  • రూ.2వేలు, 25 కేజీల బియ్యం
  • ప్రకటించిన సీఎం కేసీఆర్
    సారథి, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నకారణంగా స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కేజీల బియ్యంతో పాటు రూ.రెండువేల ఆపత్కాల ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సహాయం పొందాలనుకునే టీచర్లు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తమ బ్యాంకు ఖాతా, వివరాలతో ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుని విధివిధానాలను ఖరారు చేయాలని గురువారం ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సుమారు 1.45లక్షల మందికి మరింత మేలు కలగనుంది.