సారథి న్యూస్, కల్వకుర్తి: వాసవి క్లబ్స్ ఇంటర్ నేషనల్ జాయింట్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు, రాజేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. వాసవి క్లబ్స్ జిల్లా సర్వీసెస్ ఇన్చార్జ్ కలిమిచెర్ల రమేష్, స్రవంతి రమేష్ బాబు దంపతులను సన్మానించారు. అనంతరం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జూలూరి సత్యం, క్లబ్ సభ్యులంతా వారిని శాలువాతో సత్కరించారు. 80 కొత్త సభ్యులను చేర్పించిన సభ్యత్వం చెక్కును రమేష్‌బాబుకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ కల్వ హరికృష్ణ, జోన్ చైర్మన్ మాచిపెద్ది అశోక్, క్లబ్ సెక్రటరీ చిగుల్లపల్లి శ్రీధర్, బాదం రఘు, బాదం హరీశ్, కంది ప్రవీణ్, పోల విజయ్, దుగ్గి వెంకటేష్, కొండూరు కృష్ణయ్య, గుబ్బ కిషన్, గుబ్బ పరమేశ్వర్, యాద శోభన్ బాబు, నరసింహారావు, వాసవి క్లబ్ సభ్యులు, రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
- March 14, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KALWAKURTHY
- kanyaka parameshwari
- vasavi club
- కన్యకా పరమేశ్వరి
- కల్వకుర్తి
- వాసవిక్లబ్
- Comments Off on ఘనంగా వివాహ వార్షికోత్సవం