సారథి, చొప్పదండి: రాష్ట్రంలో స్కూళ్లను వెంటనే తెరవాలని, పిల్లలందరికీ తక్షణమే వ్యాక్సిన్ఇచ్చి వారి భవిష్యత్ దృష్ట్యా ఆన్లైన్ క్లాసులకు స్వస్తి పలకాలని, స్కూళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకొని విద్యాబోధన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్ కుమార్ కోరారు. గురువారం ఆయన చొప్పదండి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఏడాదికిపైగా బోధనకు దూరంగా ఉండటం ద్వారా విద్యార్థులు చదువులో వెనుకబడటంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని అన్నారు. ఇది మంచి పరిణామం కాదని, వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులు తమ ఉపాధిని పక్కనపెడుతున్నారని అన్నారు. అలాగే ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే ఉద్యోగులకు జీవనభృతి అందక వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయని అన్నారు.