వైభవంగా ఉగాది వేడుకలు
సామాజికసారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుభకృత్‌నామ ఉగాది ఉత్సవాలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పేటలోని రామాలయంలో ఎంపీపీ జoగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, గ్రామ ప్రజలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణ పండితులు మహేశ్‌శర్మ పంచాంగ శ్రవణం పాటించగా ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామపెద్దలు గుజ్జరి కనకరాజు, కందుకూరి రవీందర్, మురళి పంతులు, సుభాష్ గౌడ్, కిష్టారెడ్డి, గంగారెడ్డి, అనిల్ కుమార్, రాగం సిద్దేశ్వర్, సర్వేశ్వర్, బుడాల సాయిలు, నిజున రమేష్, అనిల్, శ్రావణ్ అధికసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
మీనాగౌడ్ కు ఉగాది పురస్కారం
పెద్దశంకరంపేట మందల కేంద్రానికి చెందిన ఎంలోల్ల మీనాగౌడ్ కు శనివారం ఉగాది సందర్భంగా పురస్కారం అందజేశారు. రాష్ట్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో జానపద గాయడిగా ఆమెకు ఈ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మండలి మాజీ స్పీకర్ స్వామిగౌడ్ తదితరుల పాల్గొన్నారు.
ఘనంగా బండ్ల ఊరేగింపు
ఉగాది పర్వదినం పురస్కరించుకొని పెద్దశంకరంపేటలోని దుర్గాభవానీ ఆలయం, కొండలరాయుని ఆలయం, పోచమ్మ ఆలయం చుట్టు శనివారం సాయంత్రం ఘనంగా బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఎద్దుల బండ్లను మామిడి ఆకులు, వేప తోరణాలతో పాటు వివిధ రకాల చీరలు రవికలతో అందంగా అలంకరించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు వివిధ ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ సత్యనారాయణ, గ్రామపెద్దలు మురళి పంతులు, కిష్టారెడ్డి, దాదిగారి గంగాధర్, సర్వేశ్వర్, అనిల్, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.