సారథి, ములుగు: స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం క్రిష్ణయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల హయాంలో 1946 మే 17న మగ్దూం మొహియుద్దీన్ ఇంట్లో కొందరు ఉపాధ్యాయుల సమావేశమై పురుడుపోసుకున్న సంఘం 1947 జూన్ 9న హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ గా ఆవిర్భవించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఎస్టీయూగా రూపాంతరం చెంది నాటి నుంచి నేటివరకు విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ హక్కుల సాధనకు అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ విజయాలను సాధించిందన్నారు. కార్యక్రమంలో వెంకటాపూర్ మండల శాఖ అధ్యక్షులు బండారి జగదీశ్, రాజేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
- June 10, 2021
- Archive
- Makhdoom Mohiuddin
- MULUGU
- STU
- ఎస్టీయూ
- మగ్దూం మొహియుద్దీన్
- ములుగు
- Comments Off on ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు