సారథి, రామాయంపేట: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన దివస్ ) సందర్భంగా బీజేపీ నిజాంపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖర్జీ సేవలను కొనియాడారు. కశ్మీర్ విషయంలో ముఖర్జీ దేశంలో ఒకటే జెండా ఒక్కరే ప్రధాని ఒకటే శాసనం ఉండాలని కృషిచేశారని గుర్తుచేశారు. ముఖర్జీ నినాదాన్ని దేశ ప్రధాని నరేంద్రమోడీ దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370ను రద్దుచేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ తో పాటు ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి అయ్యవారి నరేష్, గిరిజన మోర్చా అధ్యక్షుడు కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- June 23, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BJP
- shyamprasad mukarjhi
- జనసంఘ్
- బలిదాన దివస్
- బీజేపీ
- శ్యాంప్రసాద్ముఖర్జీ
- Comments Off on ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి