సారథి, వడ్డేపల్లి(మానవపాడు): మాదాసి, మాదారి కురువ కులస్తులకు ఎస్సీ ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలని సంఘం రాష్ట్ర కన్వీనర్దన్నడ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం ఎస్సీ సంక్షేమ సంఘం కార్యదర్శి కురువ పల్లయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మదాసి, మదారి కురువలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలను జారీచేయడంలో జిల్లా యంత్రాంగం అధికారులు ఆలస్యం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నాయకులు వేణుగోపాల్, ఆంజనేయులు, అలంపూర్ తాలుకా నాయకులు సదానందమూర్తి, పెద్దసోమన్న, ఠాగూర్ కృష్ణ, బుక్కపురం లక్ష్మన్న, వేణుగోపాల్, ఆంజనేయులు, చంద్రన్న, మధు, నరసింహులు, నాగభూషణం, దేవేంద్ర, రంగస్వామి, వెంకటేశ్, బీచుపల్లి, చిట్టిబాబు, రామాంజనేయులు, వెంకట్రాముడు, బుచ్చన్న, స్వాములు, రఘు, పరుశరాముడు, విజయ్, భాస్కర్, తిప్పన్న, ఈశ్వరయ్య, కృష్ణ పాల్గొన్నారు.
- July 12, 2021
- Archive
- alamapur
- madari
- madasi kuruva
- అలంపూర్
- మాదారి
- మాదాసి కురువ
- మానవపాడు
- Comments Off on ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి