Breaking News

ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు పొందుతారు..

ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు పొందుతారు..

Get the expected status in the job ..

నేటి రాశిఫలాలు
28 ఏప్రిల్ 2021
బుధవారం

నక్షత్రం: విశాఖ రాత్రి 8.15 గంటలకు
రాహుకాలం: పగలు:12.00 నుంచి 1.30 గంటలు
యమగండం: ఉదయం 7.30 నుంచి 9.00
దుర్ముహుర్తం: పగలు: 11.36 నుంచి 12.24

మేషం: రాజకీయవేత్తలకు గందరగోళం, కుటుంబంలో చికాకులు ఉంటాయి. వృత్తి,వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడతాయి. పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇంటాబయట కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు తగదు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు. బంధువులతో అకారణంగా తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు ఎదురవుతాయి.

వృషభం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి లాభ సూచనలు, ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. మీ ఉన్నతిని చూసి ఆసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులకు, స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచిఉండాల్సి వస్తుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్యసమాచారం అందుతుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: కుటుంబ సమస్యలు వేధిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులకు ప్రయాణాల్లో అధిక ఒత్తిడి, చికాకులు, ఇబ్బందులు తప్పవు. బంధువులతో చికాకులు తలెత్తుతాయి. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. రావలసిన ధనం అందకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. బంధువులతో తగాదాలు, శారీరక రుగ్మతలు వస్తాయి. కొన్ని పనులను వాయిదా వేస్తారు. రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు తప్పవు. వ్యవహారాల్లో అంచనాలు తప్పుతాయి.

కర్కాటకం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలకు గురవుతారు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. ఏ సమస్యనైనా దీటుగా ఎదుర్కొంటారు. అనుకున్న పనులు ఆశించినంత చురుగ్గా సాగవు. ఇంటాబయట సమస్యలు వస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు వస్తాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు కలుగుతాయి.

సింహం: జీవిత భాగస్వామితో విభేదాలు తీరతాయి. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు పథకాలు సత్ఫలితాలనిస్తాయి. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ప్రైవేట్​ సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆకస్మిక ధనలాభాలు ఉండొచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు కొనసాగుతాయి.

కన్య: ఒక కీలక సమాచారం అందుతుంది.రాజకీయ కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. దంపతుల మధ్య కలహాలు పట్టింపులు ఎదుర్కొంటారు. మీ సంతానంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ల వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఖర్చులు అధికమవుతాయి.

తుల: మహిళలకు కొన్ని వివాదాలు మనస్తాపం కలిగిస్తాయి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. ప్రత్యర్థులు సైతం మీ ఔనత్యాన్ని గుర్తిస్తారు. బంధువులతో విభేదాలు, శారీరక రుగ్మతలు, ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.

వృశ్చికం: మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు వస్తాయి. తోటివారి సహకారం వల్ల పాత సమస్యలు పరిష్కరమవుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. బంధువర్గంతో విరోధాలు వస్తాయి. అంచనాల్లో పొరపాట్ల వల్ల వ్యవహారాలు నత్తనడకన కొనసాగుతాయి. కళారంగాల వారికి మానసిక ఆందోళన తప్పదు.

ధనుస్సు: కీలక నిర్ణయాలు తీసుకోకండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. వ్యాపారాల్లో చికాకులు తొలగుతాయి. వస్తులాభం. గృహయోగం, ఉద్యోగులకు ఉన్నత హోదాలు, ఉభయలకు ఇంటాబయట గొడవలు ఉంటాయి.

మకరం: కొత్త కాంట్రాక్టులను పొందుతారు. కుటుంబసమస్యలు, వ్యాపార లాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబసభ్యులతో సఖ్యత, ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మీ మాటతీరు మన్ననలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయం అందుతుంది. మత్స్య, కోళ్ల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

కుంభం: కుటుంబసభ్యుల నుంచి సహకారం అందదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మిత్రులు శత్రువులుగా మారతారు. కష్టసమయంలో ఆత్మీయులు చేదోడు, వాదోడుగా నిలుస్తారు. ఉద్యోగులకు విధుల నిర్వహణలో ఒత్తిళ్లు. తోటల రంగాల వారికి చికాకులు తప్పవు. విద్యార్థులకు కొంత మేరకు ఒత్తిళ్లు ఉంటాయి. ఊహించని విధంగా ఆరోగ్యపరంగా చికాకులు వస్తాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి.

మీనం: స్నేహితుల నుంచి చెడు సమాచారం. పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకుల కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆప్తులతో విభేదాలు, రియల్ ఎస్టేట్​ రంగంలో ఉన్నవారికి ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది.

:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్​నం.95020 59649