సామాజికసారథి, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్టించారు. జై గణేశా.. జై జై గణేశా!! అనే నామస్మరణ మార్మోగింది. యువజన సంఘాల సభ్యులు పూజలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదం అందజేశారు.
ఆపదలు తొలగించే గణాధిపతి
సామాజికసారథి, మందమర్రి (మంచిర్యాల): దేవుళ్లలో ప్రథముడు, జ్ఞానం పరిపూర్ణత అదృష్టానికి ప్రతీక విజ్ఞానం తొలగించే గణనాథుడి ఆశీస్సులు ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉండాలని, సుఖసంతోషాలు శాంతి శ్రేయస్సుతో నిండిపోవాలని, ఆటంకాలను పోగొట్టి కార్యాలను సిద్ధింపజేసే గణేశుడిని భక్తిపారవశ్యంతో మందమర్రి పట్టణం మార్కెట్ లో మొదటిరోజు పూజలు అంగరంగవైభవంగా నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మంచిర్యాల టీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో పట్టణ మార్కెట్ లో ప్రతి సంవత్సరం తన స్వంత ఖర్చులు వెచ్చించి 18 ఫీట్ల భారీ గణనాథుడి ప్రతిష్టిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు వినాయక విగ్రహ ప్రతిష్టాపన పూజలో ఏసీపీ ఎడ్ల మహేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు, మేడిపల్లి సంపత్, జంగిలి రవీందర్, మద్ది శంకర్, తమ్మిశెట్టి విజయ్, గంప ఆంజనేయులు దంపతులు, మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు.
వినాయక వ్రత మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు
సామాజికసారథి, పరకాల: వినాయక చవితిని పురస్కరించుకుని పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన గణపతి వ్రత మహోత్సవంలో స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. మొదట కుంకుమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద వ్రతం ఆచరించారు. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మహోత్సవంలో మున్సిపల్ చైర్ పర్సన్, ఆలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, వేదపండితులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు.
వినాయకుడికి భారీ సెట్టంగ్
సామాజికసారథి, చౌటుప్పల్: చౌటుప్పల్ జిల్లా పట్టణం గాంధీపార్క్ ఆవరణలో వినాయక చవితి సందర్బంగా భారీ సెట్ ఏర్పాటు చేశారు. గత 38 ఏళ్లుగా శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడికి పూజలు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు శివాజీ యూత్ సభ్యులు 200 మంది ఉంటారు. ఒక సెట్టు ప్రాపర్టీ ఖర్చు రూ.రెండు లక్షల నుంచి సుమారు రూ.మూడు లక్షల వరకు వస్తుందని శివాజీ యూత్ సభ్యులు తెలిపారు. నవరాత్రులు అంగరంగ వైభవంగా గణనాథుడి పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తారు. సుమారు నవరాత్రుల ఖర్చులు రూ.4లక్షల రూ.5లక్షల వరకు ఉంటుందని సభ్యులు తెలిపారు. గాంధీ పార్క్ లో పెట్టిన వినాయకుడికి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
గణనాథుడికి ప్రత్యేకపూజలు
సామాజికసారథి, శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా బుధవారం గణేశుడి మండపాలను అందంగా అలంకరించి అందులో వినాయకుణ్ణి ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన శివ్వంపేట మార్కెట్ ఆవరణలో బారీ వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. మండలంలోని పిల్లుట్ల గ్రామంలోని చావిడి వద్ద బారీ లంబోదరుడిని ప్రతిష్టింపజేశారు. వినాయకుడికి గ్రామ సర్పంచ్ పెద్దపులి రవి, సంఘ సేవకులు బండారి గంగాధర్ ప్రత్యేకపూజలు చేశారు.