- సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు
- పలు అభివృద్ధి పనుల మంజూరుకు ముఖ్యమంత్రి హామీ
సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ పనులు, పలు సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రజాప్రతినిధులు శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలిసి విన్నవించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నకిరేకల్ నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను సీఎం దృష్టికి తెచ్చారు. త్వరలో ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చారు. నకిరేకల్, రామన్నపేటకు వంద పడకల ఆస్పత్రి మంజూరుకు హామీ ఇచ్చారు. అదనపు కోర్సులు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని మంజూరుతో పాటు అదనపు కోర్సులను మంజూరు చేయాలని కోరగా.. వచ్చే ఏడాది నుంచి ప్రారంభిద్దామని సీఎం చెప్పారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో ఉన్న కాల్వల లైనింగ్ పనులకు కావాల్సిన రూ.1,217.71ను మంజూరుచేస్తూ జీవోనం 60ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.