సామాజిక సారథి, తాడూరు : నాగర్కర్నూల్జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకట్ దాస్ హాజరై మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ పేద ప్రజలు అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, సర్పంచ్ గుంటి నిరంజన్, ఉపసర్పంచ్చిలుక కృష్ణారెడ్డి, వార్డ్ సభ్యులు పద్మ, ఏఎన్ఎం శార రాజేశ్వరి, అంగన్వాడీలు శారద, వెంకటమ్మ, ఆశావర్కర్లు మంగ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.