Breaking News

‘గొర్రెల పంపిణీ’ పేరుతో మోసం

‘గొర్రెల పంపిణీ’ పేరుతో మోసం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మాయమాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్​ మోసగిస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు అన్యాయం చేసిందన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్​లో పార్టీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన గొల్ల కురుమలకు రూ.3వేల పింఛన్​, రూ.ఆరులక్షల బీమా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈనెల 26న జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్ లో గొల్ల కురుమల రణభేరి సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత మల్లేష్​ యాదవ్​, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కోరే ఎల్లయ్య, నందు జనార్దన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు గౌడ్, జిల్లా కిసాన్​మోర్చా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పోగుల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేష్, మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్, దశరథ్, డప్పు స్వామి, సయ్యద్, నరేష్ నాయక్, తాటికొండ మహేష్, మూర్తి శంకర్ పాల్గొన్నారు.