Breaking News

కేదారీ వ్రతం పూజకు హాజరైన మాజీ మంత్రులు

కేదారీ వ్రతం పూజకు హాజరైన మాజీ మంత్రులు

సామాజిక సారథి, ఉప్పల్: అంబర్ పేటలోని మాజీ పార్లమెంట్ సభ్యుడు వి.హనుమంతరావు గృహంలో శుక్రవారం కేదారీ వ్రతం పూజకు మాజీ మంత్రులు హాజరైనట్లు హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను సందర్భంగా వేద బ్రాహ్మణులతో సత్యనారాయణ వ్రతం, నోము పూజను జరుపుకున్నామని తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి మాజీ మంత్రులు మాజీ హోం శాఖ మంత్రి జానారెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి సెక్రెటరీ రోహిత్ చౌదరి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి, చంద్రశేఖర్, టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, గడ్డం శ్రీధర్, లక్ష్మణ్ యాదవ్, లక్పతి యాదగిరి, అనిల్ కుమార్, మహమ్మద్ ఫరీద్, జమిర్ తదితరులు పాల్గొన్నారు.