- 44మంది విద్యార్థినులకు అస్వస్థత
- ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సాంఘిక శాఖ సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం స్కూలులో బ్రేక్ పాస్ట్ లో పులిహోర తిన్న విద్యార్థినులు టిఫిన్ చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులకు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. మిగతా విద్యార్థులకు డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ లాల్, డాక్టర్ చంద్రశేఖర్ బృందం పర్యవేక్షణలో స్కూలులోనే వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఆర్సీ వనజ విద్యార్థినులను పరామర్శించారు. వాటర్ నమూనాలను పరీక్షల కోసం పంపించారు. వడదెబ్బ కూడా కారణమై ఉండొచ్చని డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ లాల్ తెలిపారు. రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు. సోమవారం నుంచి కొంత మంది విద్యార్థులకు జ్వరం వచ్చిందని, దాంతో ఉదయం బ్రేక్ పాస్ట్ పులిహోర తిన్న తర్వాత మిగతా విద్యార్థులకు ఇబ్బంది అయిందని విద్యార్థులు తెలిపారు.