Breaking News

ఆలయాల్లో కొవిడ్ ​నిబంధనలు పాటించండి

ఆలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించండి

సామాజిక సారథి, హైదరాబాద్‌: వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్‌ చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదని దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయాల్లో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని, ముఖ్యంగా మాస్క్​, భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఎండోమెంట్‌ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లో ఏకాదశి దర్శనాలను నిషేధించారు. భద్రాచలం, ధర్మపురి, యాదాద్రి, వేములవాడ, హైదరాబాద్‌లోని ప్రధాన ఆలయాల్లో దర్శనాలకు అనుమతి లేదని ఆలయాల ముందు బోర్డు పెట్టారు.