సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ వో) డాక్టర్ కె.సుధాకర్ లాల్ సోమవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినేపల్లి పీఎచ్ సీ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి వారి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా నమోదుచేసుకుని, వారికి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉండి మందులు వాడుతున్న వారిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉన్నా మాస్కులు ధరిస్తూ ఉండేలా చూడాలని సూచించారు. ఐదురోజుల తర్వాత కూడా అవే లక్షణాలు ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ సలహా మేరకు మందులు వాడేలా చూడాలని టీం సభ్యులకు సూచించారు. ఫీవర్ సర్వేలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్, వైద్యసిబ్బంది ఉన్నారు.
- May 24, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BIJINEPALLY
- feverservey
- NAGARKURNOOL
- నాగర్ కర్నూల్
- ఫీవర్ సర్వే
- బిజినేపల్లి
- Comments Off on ఫీవర్ సర్వే పక్కాగా ఉండాలి