సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ మాలోతు లక్ష్మి భీలునాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అక్కన్నపేట మండలంలోని చౌటపల్లితో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గద్దల రమేశ్, ఎంపీటీసీ గంగాదరి సుగుణ, వార్డు సభ్యులు ఆవుల పద్మ, కో ఆప్షన్ సభ్యులు ఆవుల చిన్నవెంకటయ్య, పులికాశి రమేష్, రెవెన్యూ అధికారి సురేందర్, ఏపీఎం శ్రీనివాస్, వివో కార్యదర్శులు లక్ష్మి, హంసలత, రైతు సమన్వయ సమితి సభ్యులు రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు రంగారావు, అనిల్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
- May 2, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AKKANNAPETA
- Chautapalli
- Dhalars
- Farmers
- Mandal
- Mosa
- Nammi
- Povaddu
- VILLAGE
- అక్కన్నపేట
- గ్రామం
- చౌటపల్లి
- ధళారులు
- నమ్మి
- పోవద్దు
- మండలం
- మోస
- రైతులు
- Comments Off on రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు