సారథి, రామడుగు: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల దోపిడిని అరికట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల రైతులు సోమవారం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద వరిధాన్యాన్ని తగలబెట్టి ఆందోళనకు దిగారు. అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటకు కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు క్వింటాలుకు 3కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకొవట్లేదని రైతులు వాపోతున్నారు. రైతులు చేస్తున్న ఆందోళన వద్దకు తహసీల్ధార్ కొమాల్ రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ యాస్మిన్, ఐకేపీ ఎపీఎం ప్రభాకర్ చేరుకొని మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
- May 3, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on రోడ్డెక్కిన అన్నదాతలు