సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏటూరునాగారంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 మంది సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రతీ ఇంట్లోనూ సోదాలు చేశారు. అనుమానితులను రానివ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఎస్సై తిరుపతి నేతృత్వంలో మండలంలోని బర్లగూడెం గ్రామ సమీపంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శిక్షణ ఎస్సై ప్రసన్నకుమార్, సిబ్బందితో కలిసి వాహనాలను, ఆర్టీసీ బస్సులను ఆపి సోదాలు చేశారు. అనుమానిత వ్యక్తుల నుంచి పూ ర్తి సమాచారాన్ని సేకరించారు.
తాడ్వాయి మండలం జలగలంచ గొత్తికోయగూడెంలో ఎస్సై వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. గూడెంలోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. గూడెంలోకి కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని కాటాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీచేశారు. అలాగే ఏటూరునాగారంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 మంది సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రతి ఇంట్లోనూ సోదాలు చేశారు. అనుమానితులను రానివ్వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు.