హైదరాబాద్: కొవిడ్ పరీక్షల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో దోపిడీ చేస్తుంటే చోద్యం చూస్తుందన్నారు. జీవోనం.539 ఎక్కడా అమలు కావడంలేదని తెలిపారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కరోనా కట్టడికి, అలాగే దోపిడీకి పాల్పడుతున్న కేంద్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- March 26, 2021
- Archive
- పొలిటికల్
- CONGRESS
- covid tests
- dasoju sravan
- private hospital
- కాంగ్రెస్ దాసోజు శ్రవణ్
- కొవిడ్ పరీక్షలు
- ప్రైవేట్ ఆస్పత్రి
- Comments Off on ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలి