Breaking News

తేమ పేరుతో దోపిడీ చేసిన్రు

తేమ పేరుతో దోపిడీ చేసిన్రు

  • 20.80 క్వింటాళ్ల వరి ధాన్యం డబ్బులు నష్టపోయా..
  • ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి
  • సోషల్​ మీడియా ద్వారా ఓ రైతు ఏకరువు

సారథి, బిజినేపల్లి: తేమ సాకుతో తనను నిలువునా దోపిడీ చేశారని ఓ రైతు ఆక్రందన వ్యక్తం చేశాడు. తన బాధను సోషల్​మీడియా ద్వారా గురువారం నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కలెక్టర్​ ఎల్.శర్మన్​కు విన్నవించారు. తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరాడు. తన ఆవేదనను ఇలా పంచుకున్నాడు. ‘నా పేరు చటమోని తిరుపతయ్య మాజీ ఎంపీటీసీ సభ్యుడిని, మాది లింగసానిపల్లి గ్రామం, బిజినేపల్లి మండలం. ప్రస్తుతం మా అమ్మ ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతోంది. నెలన్నరోజుల క్రితం 639 బ్యాగుల వరి ధాన్యాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) ద్వారా మార్క్​ఫెడ్​కు అమ్మాను. అయితే ఇక్కడ తేమ బాగానే ఉంది. నాగర్​కర్నూల్​లోని సత్యసాయి రైస్​మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో క్వింటాలుకు రెండు కేజీల చొప్పున తరుగు తీస్తామని చెప్పిండ్రు. కానీ 52 బ్యాగ్​లకు రావాల్సిన డబ్బులను కట్​చేసి.. 587 బ్యాగ్​లకు మాత్రమే డబ్బులను నిన్న నా బ్యాంకు ఖాతాలో జమచేశారు. దాదాపు 20.80 క్వింటాళ్ల సంబంధించి వరి ధాన్యం డబ్బులను నష్టపోయాను. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకెళ్లాను. వారికి సోషల్​మీడియా ఫిర్యాదు చేశాను.’ అని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.