సారథి న్యూస్, రామాయంపేట: నీటి సౌకర్యం లేని గ్రామాల్లో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించామని స్ట్రీట్ కేస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ అనే ఎన్జీవో(హైదరాబాద్)కు చెందిన సభ్యులు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఖాసీంపూర్ ప్రైమరీ స్కూలు ఆవరణలో స్థానిక ఎస్సై ప్రకాష్ గౌడ్ చేతులమీదుగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఖాసీంపూర్ గ్రామంలో నీటి సౌకర్యం సరిగ్గా లేదని గుర్తించి.. నిధులు సేకరించి వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమంలో లిఖిత్, భావన, ఆదర్శ్, రాజేశ్వరి, అక్షిత, అభినయ, పవన్, యతీశ్ అఖిలేష్, తరుణ, పృథ్వీ, గ్రామ సర్పంచ్ సునీత, ఉపసర్పంచ్ నారగౌడ్ ఉన్నారు.
- January 23, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- LARGEST RUN
- RAMAYAMPET
- STREET CASE
- WATERPLANT
- ఖాసీంపూర్
- రామాయంపేట
- వాటర్‌ప్లాంటు
- స్ట్రీట్ కేస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్
- Comments Off on సొంత ఖర్చులతో వాటర్ ప్లాంటు ఏర్పాటు