సామాజికసారథి, బిజినేపల్లి: మండలంలోని వెల్గొండ గ్రామంలో బుధవారం సిపిఐ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈర్ల నర్సింహ అనారోగ్యంతో మరణించడంతో గురువారం వారి నివాసంలో వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వెల్గొండ గ్రామసర్పంచ్ గా, ఎంపీటీసీ గా, గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన మరణం చాలా బాధాకరమని అన్నారు. ఈర్ల నర్సింహ మరణం తనకు, నాగర్ కర్నూల్ ప్రజలకు తీరనిలోటని అన్నారు. సుదీర్ఘకాలం పాటు నిస్వార్థంగా ప్రజాజీవితాన్ని గడిపారన్నారు. పేదలకు అండగా నిలుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారని ఆయన కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిరణ్, ఎంపీటీసీ బాలస్వామి, ముద్దం పులేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాలరాజ్ గౌడ్, వెంకట్ స్వామి, వట్టెం తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- May 19, 2023
- Top News
- Comments Off on ఈర్ల నర్సింహ నర్సింహ మృతి బాధాకరం