సామాజిక సారథి, అచ్చంపేట: ఉపాధి హామీ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇస్తున్నారని, నాలుగు నెలలైనా కొందరికి కూలి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ చట్టంలో రెండు వారాలకు ఒకసారి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తుంగలో తొక్కాయని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018లో భర్తలు చనిపోయిన కొందరు మహిళలు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు ఇవ్వలేదన్నారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు తిరుపతమ్మ, కూలీలు అలివేల, వరలక్ష్మి, ఇందిరమ్మ, రమణమ్మ, లక్ష్మమ్మ, కృష్ణమ్మ, బాలమ్మ, రాములమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
- August 12, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- EGS WORKS
- pending bills
- ఉపాధి హామీ
- పెండింగ్బిల్లులు
- వ్యకాసం
- Comments Off on ‘ఉపాధి’ బిల్లులు వెంటనే చెల్లించాలి