సామాజికసారథి, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లిలో మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము రమేష్, గౌరవ అధ్యక్షుడిగా ఈదులపల్లి జంగయ్య, ఉపాధ్యక్షుడి ఈదులపల్లి శ్రీనివాస్, దూళ్ల రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి వెంకటయ్య, కార్యదర్శులుగా ఈదులపల్లి జంగయ్య, తాండ్ర లక్ష్మయ్య ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులు కొమ్ము జంగయ్య, ఈదులపల్లి శ్రీకాంత్ సలహాదారులుగా తాండ్ర జంగయ్య, దూళ్ల జంగయ్యతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల మాదిగల ఐక్య వేదిక పర్యవేక్షకులు దాసరి రాము, గుద్దటి కిష్టాల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మాదిగల చైతన్యం, హక్కుల సాధన కోసం.. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కృషిచేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు జంగయ్య, మీసాల అంజయ్య, తక్కళ్లపల్లి శేఖర్, కొయ్యల పుల్లయ్య, దూళ్ల పెద్దయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
- January 29, 2023
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- ngkl
- vledanada
- ఐక్యవేదిక
- మాదిగలు
- Comments Off on మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక