
సామాజికసారథి, వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి(చల్లపల్లి)లో మాదిగ ఐక్యవేదిక కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా సమావేశానికి మాదిగ ఐక్యవేదిక నాయకులు కొయ్యల పుల్లయ్య, గుద్దటి కిస్టాల్, కొమ్ము అంజయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మీసాల అంజయ్య మాట్లాడుతూ.. మాదిగలు రాజకీయాలకు అతీతంగా ఏకమై తమ చైతన్యాన్ని చాటుకోవాలని కోరారు. ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు మనమంతా కంకణబద్ధులం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము ప్రేమ్ కుమార్, గౌరవ అధ్యక్షుడిగా పకాడి వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పకాడి ఈశ్వర్, పోలే ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము జలంధర్, కార్యదర్శులుగా పకాడి రామస్వామి, సంయుక్త కార్యదర్శులుగా పోలే వెంకటయ్య, భూత్కూరి అంజయ్య, కోశాధికారిగా పి.మహేశ్, గౌరవ సలహాదారులుగా మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాశ్, కొమ్ము విజయ్ కుమార్, రామాంజనేయులు, జగదీశ్వర్, శశికుమార్.. కార్యవర్గ సభ్యులుగా మరో 30 మందిని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు

మాదిగ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు