సామాజిక సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కురుమ సంఘం మహిళా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలాధ్యక్షురాలిగా వేముండ్ల స్వప్న, ప్రధాన కార్యదర్శిగా పెద్దిగారి లక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. కురుమ కులస్తులు ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య, జిల్లా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి గుంటి స్వరూప, ఉపాధ్యక్షురాలు పెద్ది అనిత, కడారి వీరయ్య, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల నరసింహరాజు, కోరే గట్టయ్య, కృష్ణరాజుతో పాటు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
- September 5, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KURUMA
- RAMADUGU
- కరీంనగర్
- కురుమలు
- రామడుగు
- Comments Off on కురుమ సంఘం మహిళా కమిటీ ఎన్నిక