సామాజిక సారథి, కట్టంగూర్: అధైర్యపడొద్దు అండగా ఉంటానని జడ్పీటీసీ తరాల బలరామ్ అన్నారు. గురువారం మండలం ఈదులూర్ గ్రామ ఎంపీటీసీ తవడబోయిన భవాని అత్తమ్మ పిచ్చమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారన్నారు. ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ (బాబు), ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తంరెడ్డి, కురుమర్తి ఎంపీటీసీ బిరెల్లి రాజ్యాలక్మిప్రసాద్, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పోన్నం అంజయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ నకిరేకంటి ఇంద్రమ్మ, గ్రామశాఖ అధ్యక్షులు శీను, ముతి పుష్పాలతవెంకన్న, ముత్యాలమ్మ గూడెం ఎంపీటీసీ మల్లేబోయిన శ్రీలత కృష్ణ, చింత నాగార్జున టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- October 26, 2022
- Archive
- లోకల్ న్యూస్
- Kattangur
- MPTC
- ZPTC
- Comments Off on అధైర్యపడొద్దు అండగా ఉంటాను