సారథి న్యూస్, మానవపాడు: తమ వ్యవసాయ పంట పొలాల గుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు గ్యాస్ పైప్ లైన్ వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామస్తులు రాయచూర్– కర్నూలు అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. తక్షణమే గ్యాస్ పైప్ లైన్ పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. పైప్లైన్ద్వారా ప్రాణనష్టం వాటిల్లుతుందన్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
- January 14, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GADWALA
- HINDUSTAN PETROLIUNM
- MANAVAPADU
- గద్వాల
- గ్యాస్పైప్ లైన్
- మానవపాడు
- రాయిచూర్– కర్నూలు
- హిందుస్థాన్ పెట్రోలియం
- Comments Off on మా పొలాల గుండా గ్యాస్పైప్ లైన్ వద్దు