- చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
సామాజిక సారథి, జనగామ: ధాన్యం కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి అనడం అత్యంత చేతకాని సిగ్గుమాలిన చర్య అని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో రూ. 1లక్ష10వేల కోట్ల అప్పులు చేసి, కమీషన్లతో కేసీఆర్ ఆరాచకపాలన కొనసాగుస్తూరని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిలు రబీ, సీజన్ లో వరిసాగుపై తెలంగాణ రైతాంగంలో అపోహలు సృష్టించి గందరగోళానికి గురి చేస్తూ, అన్నదాతలను ఆత్మహత్యలకు పూరి గొప్పుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని చేప్పి ప్రాజెక్టులు కట్టి కమీషన్లురాగానే రబీ, సీజన్ లో వరిసాగుపై ఆంక్షలు పెట్టడం అధికార పార్టీ ధనదహానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నరని పేర్కొన్నారు.